అధికారం కోసం ఓ అత్త... మమకారం కోసం కోడళ్ళు
on Jun 11, 2022
'దేవతలారా దీవించండి' అనే అద్భుతమైన సీరియల్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన జీ తెలుగు, ఇప్పుడు 'కోడళ్ళు మీకు జోహార్లు' అనే మరో ఆసక్తికరమైన సీరియల్ తో ఈ సోమవారం నుండి ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది. అత్తాకోడళ్ల ఆధిపత్యపోరు నేపధ్యంగానే వస్తున్నప్పటికీ, ఈ సీరియల్ కాస్త భిన్నంగా హాస్యభరిత మరియు ప్రతీకార సన్నివేశాలతో తెరకెక్కించబడింది. ఈ సీరియల్ ప్రతి సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రసారం కానుంది.
పవిత్ర, కౌస్తుభా మని, దుర్గశ్రీ, మరియు నాగార్జున ప్రధానపాత్రదారులుగా వస్తున్న ఈ సీరియల్, ఇప్పటికే విడుదలైన ప్రోమోతో అందరిని ఆకట్టుకుంటుంది. కథలోపటికీ వెళ్తే, కుటుంబ సభ్యులని మోసంచేస్తూ రేఖ (పవిత్ర) తన అక్కకొడుకు శేఖర్ నుండి కుటుంబవ్యాపారాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అంతేకాకుండా, వ్యాపారంలో తన కొడుకు తారక్ (నాగార్జున) పలుకుబడిని పెంచుకుంటూ పోతుంది. తన అధిపత్యానికి ఎటువంటి హాని కలగకూడదని, సున్నితస్థురాలైన మిథునని (కౌస్తుభా మని) ఇంటి కోడలిగా తెచ్చుకుంటుంది. ఐతే, మిథున చెల్లెలైన వైష్ణవి (దుర్గశ్రీ) ఎప్పటికప్పుడు రేఖ ఆగడాలకు మరియు తన ఆధిపత్యకాంక్షలకు అడ్డుకట్టవేస్తూ తన అక్కని కాపాడుకుంటూవస్తుంది.
ఈవిధంగా, రేఖ మరియు మిథున మధ్య జరిగే ఆధిపత్యపోరాటం కొన్నిసార్లు నవ్వులుపూయిస్తూ మరికొన్ని సార్లు ఉద్వేగాన్ని రేకెత్తిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఈ సీరియల్ ప్రారంభోత్సవం సందర్బంగా జీ తెలుగు చీఫ్ కంటెంట్ ఆఫీసర్ (తెలుగు) శ్రీమతి అనురాధ గూడూరు మాట్లాడుతూ, 'కోడళ్ళు మీకు జోహార్లు' సాధారణంగా అత్తాకోడళ్ల నేపథ్యంలో వచ్చే కథాంశాలకన్నా భిన్నంగా ఉంటుందని, ఇందులోని సన్నివేశాలు నిజజీవితంలో ఒక సాధారణ కుటుంబంలో జరిగే సంఘటనలకు దగ్గరగా ఉంటాయని చెప్పారు. అలాగే ఈ సీరియల్ పాసిటివిటీని పెంపోందిస్తుందని, ప్రేక్షకులు కచ్చితంగా ఈ వినూత్న కథాంశాన్ని ఆదరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.